లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనలు! కర్ఫ్యూ విధింపు! అదే కారణం!
Wed Jun 11, 2025 18:30 U S A.202506114928.jpg)
అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా లాస్ ఏంజెలెస్‌లో ప్రారంభమైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రజల ఆందోళనను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు యాపిల్ స్టోర్లు, ఇతర వ్యాపార కేంద్రాల్లో దోపిడీకి పాల్పడ్డారు. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్ కిటికీలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్‌లను దోచుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో అరెస్టులు జరిపారు. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ రాత్రి 8 నుంచి తెల్లవారు జాము 6 గంటల వరకు పరిమిత కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఇక ఫెడరల్ భద్రత కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్‌ను లాస్ ఏంజెలెస్‌కు తరలించారు. మొదట 2,000 మందిని పంపించగా, అనంతరం మరో 2,000 మంది గార్డ్స్‌తో పాటు 700 మంది మెరీన్లను కూడా మోహరించారు. ఈ చర్యలపై కేలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ తీవ్రంగా స్పందిస్తూ, ప్రజలపై భయపెట్టే విధంగా సైన్యం మోహరించడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. నేషనల్ గార్డ్స్ మోహరింపే ఆందోళనలకు ప్రధాన కారణమని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ నిరసనలు విస్తరించగా, టెక్సాస్, న్యూయార్క్, ఆస్టిన్ వంటి నగరాల్లో వేలాదిమంది రోడ్లపైకి వచ్చారు. ట్రంప్ ఈ ఆందోళనకారులను “జంతువులు” మరియు “విదేశీ శత్రువులు”గా అభివర్ణిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లాస్ ఏంజెలెస్‌ను క్రిమినల్స్ ఆధీనంలో ఉన్న నగరంగా అభివర్ణించిన ఆయన, శాంతిని నెలకొల్పేందుకు అన్ని వనరులను ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #LosAngelesProtests #ImmigrationRights #LAUnrest #NationalGuard #CurfewInLA #PoliceBrutality #ICEProtests #TrumpControversy #FreeSpeech #ProtestRights #USImmigration #StopTheRaids #JusticeForImmigrants #StandWithLA #DemocracyUnderThreat
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.